29-01-2026 03:58:33 PM
కామారెడ్డి,(విజయక్రాంతి):కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో సీఎం కప్–2026 క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం క్రీడాభిమానులు, యువతలో ప్రత్యేక ఉత్సాహాన్ని నింపింది. క్రీడల ప్రారంభోత్సవానికి మండల ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, దోమకొండ ఎస్‌ఐ ప్రభాకర్ హాజరై క్రీడలను అధికారికంగా ప్రారంభించారు. కబడ్డీ, వాలీబాల్ , కోకో,తదితర ఆటలతో క్రీడా ప్రాంగణం క్రీడాకారుల ఉత్సాహ నినాదాలతో మార్మోగింది. ఈ సందర్భంగా బద్దం ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కప్ ద్వారా గ్రామీణ యువతలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీయడమే లక్ష్యమని తెలిపారు.
క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, ఐక్యతను పెంపొందిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ విజయ్ కుమార్, ఏఎస్ఐ జానీ పాషా, దోమకొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనంతరెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆశబోయిన శ్రీనివాస్, ఏఎంసీ డైరెక్టర్ కదిరే గోపాల్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల్ గౌడ్, గ్రామపంచాయతీ కార్యదర్శి యాదగిరి, వివిధ గ్రామాల సర్పంచులు, పీడీలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని క్రీడాకారులను ప్రోత్సహించారు. సీఎం కప్ క్రీడలు దోమకొండ మండల యువతకు కొత్త వేదికగా నిలుస్తాయని స్థానికులు అభిప్రాయపడ్డారు.