calender_icon.png 29 January, 2026 | 7:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భౌతిక గాయానికి నివాళులర్పించిన జుక్కల్ ఎమ్మెల్యే తోట

29-01-2026 03:46:52 PM

మద్నూర్, జనవరి 29 (విజయ క్రాంతి): మద్నూర్ మండల కేంద్రానికి చెందిన ప్రముఖవ్యాపారవేత్త మిర్జాపూర్ హనుమాన్ ఆలయ డైరెక్టర్ కైలాశ్ కాకాని కైలాష్ సెట్ కాకాని అనారోగ్యంతో కన్నుమూయడం అత్యంత బాధాకరం. ఈ విషాద వార్త తెలుసుకున్న వెంటనే జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు గురువారం వారి నివాసానికి చేరుకుని కైలాష్ సెట్ కాకాని భౌతిక దేహానికి పూలమాలలు వేసినివాళులు అర్పించారు. అనంతరం జరిగిన అంత్యక్రియల్లో పాల్గొని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అలాగే మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి, ఈ కష్టసమయంలో తన వంతు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.ఈ  అంత్యక్రియల్లో కాంగ్రెస్ నాయకులు పాలుగోన్నారు.