calender_icon.png 29 January, 2026 | 5:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీలో చేరిన మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పల్లపు లక్ష్మణ్

29-01-2026 03:41:04 PM

వేములవాడ జనవరి 28 (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో రాజకీయ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పల్లపు లక్ష్మణ్ గురువారం భారతీయ జనతా పార్టీలో చేరారు. బిజెపి పట్టణ అధ్యక్షులు రాపల్లి శ్రీధర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బిజెపి రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి పార్టీ  కండువా కప్పి ఆహ్వానించారు.

లక్ష్మణ్‌తో పాటు 6వ వార్డుకు చెందిన వానిక సంపత్, మెరుగు లక్ష్మణ్, గోల్గాం గంగరాజు, చిలివేరి బాబు, జడల నరసయ్య తదితరులు భాజపా తీర్థం పుచ్చుకున్నారు.​ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. పట్టణ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి సిరికొండ శ్రీనివాస్, ఉపాధ్యక్షులు బండ మల్లేశం, జిల్లా ఎన్నికల ఇన్‌చార్జి లింగంపల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు.