18 April, 2026 | 6:19 AM

బావిలో పడ్డ ఎలుగుబంటి

01-06-2025 12:14 AM

3 గంటలు శ్రమించి రక్షించిన అధికారులు

బోథ్, మే 31: దారి తప్పిన ఓ ఎలుగుబంటి ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడింది. ఫారెస్ట్ అధికారులు మూడు గంటల పాటు శ్రమించి రక్షించారు. బోథ్ అటవీ క్షేత్రం పరధిలో దారి తప్పిన వచ్చిన ఎలుగుబంటి సాకేర గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో శనివారం ఉదయం పడిపోయింది.

గమనించిన రైతులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. ఫారెస్ట్ అధికారులు, ఫైర్ డిపార్ట్‌మెంట్, పోలీస్‌ల సహాయంతో దాదాపు మూడు గంటల పాటు శ్రమించి క్రేన్ సహాయంతో ఎలుగుబంటిని బావిలో నుంచి బయటకు తీశారు. ఆ తర్వాత ఎలుగుబంటి అడవిలోకి పారిపోయింది.