calender_icon.png 11 May, 2025 | 12:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యుద్ధ వాతావరణంలో అందాల పోటీలా?

11-05-2025 01:11:28 AM

-ఎమ్మెల్యే వివేకానంద

హైదరాబాద్, మే 10 (విజయక్రాం తి): యుద్ధ వాతావరణ సమయంలో అందాల పోటీలు అవసరామా అని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వివేకానంద ప్రశ్నించారు. అందాల పోటీలు ఆహ్లాదకర వాతావరణంలో జరగాలని, ఇప్పుడు హైదరా బాద్‌లో నిర్వహిస్తున్న అందాల పోటీ లు దేశంలో యుద్ధ వాతావరణంలో జరుగుతున్నాయని పేర్కొన్నారు.

ప్రజలు భయాందోళనతో ఉన్న ఈ సమయంలో జరుగుతున్న అందాల పోటీలను తక్షణమే ఆపాలని డిమాం డ్ చేశారు. శనివారం హైదరాబాద్ తెలంగాణభవన్‌లో ఆయన మాట్లాడారు. ప్రజలు యుద్ధభయంతో నిత్యా వసర ధరలు పెరుగుతాయన్న ఆందోళనలో ఉన్నారని తెలిపారు.

అభినవ నీరోలా సీఎం వ్యవహారిస్తున్నారని, మన విద్యార్థులు పంజాబ్, శ్రీనగర్ నంచి స్వస్థలాలకు రావలనుకుంటున్నారని, వారి గురించి ఆలో చిం చారా? అని ప్రశ్నించారు. సీఎం ఆలోచనా విధానం మారాలని హితవుప లికారు. యుద్ధంలో అమరుడైన జవా న్ మురళీ నాయక్‌కు తమ పార్టీ నివా ళి అర్పిస్తోందని చెప్పారు. సమావేశంలో బీఆర్‌ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.