calender_icon.png 12 May, 2025 | 4:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాల్పుల ఉల్లంఘనకు సంపూర్ణ బాధ్యత పాక్‌దే

11-05-2025 09:24:21 AM

న్యూఢిల్లీ: కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్థాన్ ఉల్లంఘించిందని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ(Indian Foreign Secretary Vikram Misri) స్పష్టం చేశారు. పాక్ కాల్పులను భారత సైన్యం(Indian Army) సమర్థవంతంగా తిప్పికొడుతోందని విక్రమ్ మిస్రీ సూచించారు. సరిహద్దు పొడవునా పాకిస్థాన్ ఉల్లంఘనలకు పాల్పడిందని ఆయన తెలిపారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, ఉల్లంఘనను తీవ్రంగా పరిగణిస్తున్నామని హెచ్చరించారు. కాల్పుల విరమణ ఉల్లంఘనపై తక్షణ చర్యలు తీసుకోవాలని పాక్‌కు సూచించామని విక్రమ్ మిస్రీ(Vikram Misri) తెలిపారు. సరిహద్దుల్లో కాల్పుల విరమణను కొన్ని గంటలుగా పాకిస్థాన్ ఉల్లంఘిస్తోందని  భారత విదేశాంగ కార్యదర్శి తెలిపారు. కాల్పుల విరమణ అవగాహనను ఉల్లంఘించడం సరికాదని హెచ్చరించారు. డీజీఎంవోల మధ్య జరిగిన అవగాహనను ఉల్లంఘించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని విక్రమ్ మిస్త్రీ తెలిపారు.

పాకిస్థాన్.. కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడిందని విదేశాంగ శాఖ తెలిపింది. కాల్పుల విరమణ అవగాహన ఉల్లంఘించడం అత్యంత దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తి చేసింది. కాల్పుల ఉల్లంఘనకు సంపూర్ణ బాధ్యత పాక్ దేనని భారత విదేశాంగశాఖ(Ministry of External Affairs of India) స్పష్టం చేసింది. వాస్తవ పరిస్థితిని పాక్ అర్థం చేసుకుంటుందని భావిస్తున్నామని పేర్కొంది. ఈ ఉల్లంఘనలను పాక్ నిలువరిస్తుందని ఆశిస్తున్నామని విదేశాంగశాఖ కోరింది. ఉల్లంఘనలు నిలువరించేందుకు సైన్యం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోందని చెప్పింది. సరిహద్దుల్లో పాక్ ఉల్లంఘనలకు సైన్యం తగిన విధంగా జవాబిస్తోందని భారత్ తెలిపింది. ఉల్లంఘనలు అరికట్టేందుకు సైన్యం సర్వసన్నద్ధంగా ఉందని హెచ్చరించింది. ఉల్లంఘనలు నిలవరరించేందుకు సైన్యం సంపూర్ణ అధికారం కలిగి ఉందని సూచించింది. పాక్ ఉల్లంఘనలను తిప్పికొట్టేందుకు సైన్యానికి అవసరమైన ఆదేశాలు అందాయని విదేశాంగశాఖ పేర్కొంది.