11-05-2025 01:11:12 AM
కాళేశ్వరం ఘాట్‌కు సరస్వతీఘాట్‌గా నామకరణం
హైదరాబాద్, మే 10(విజయక్రాంతి): తెలంగాణలోని జయశం కర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం, సరస్వతీ పుష్కరాలకు సిద్ధమవుతోంది. గోదావరి, ప్రాణహిత నదు లతో సరస్వతినది కలిసే త్రివేణి సంగమంలో పుష్కర స్నానాల కో సం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కాళేశ్వరంలో ప్రస్తుతం ఉన్న ఘాట్‌ను విస్తరిస్తూ సుమారు 86 మీటర్ల వెడల్పుతో నూతన ఘాట్ ను నిర్మిస్తున్నారు. నూతన ఘాట్‌పై 16 అడుగుల ఎత్తున సరస్వతీ అమ్మవారి రాతి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నా రు.
పుష్కరాలు జరిగే 12 రోజులు నదికి హారతి ఇచ్చేందుకు వేదికను సైతం ఏర్పాటుచేస్తున్నారు. వీఐపీ ఘాట్‌గా పిలుస్తున్న ప్రస్తుత ఘాట్ ను ఇక నుంచి సరస్వతీఘాట్‌గా నా మకరణం చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. మిగిలిన నదులలాగా కాకుండా సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తోంది. బృహస్పతి మి థునరాశిలోకి ప్రవేశించినప్పుడు సరస్వతినదికి పుష్కరాలు వస్తాయి. ఈ నెల 15 నుంచి 26వ తేదీ వర కూ పన్నెండు రోజుల పాటు సరస్వ తీ నదికి పుష్కరాలు జరుగబో తున్నాయి. ఏర్పాట్లు పూర్తి అయ్యా యని అధికారులు తెలిపారు.