11-05-2025 01:13:55 AM
-కారులో ఇద్దరు యువకుల సజీవదహనం
-చికిత్స పొందుతూ మరొకరి మృతి
-మృతులంతా ప్రాణస్నేహితులు
అబ్దుల్లాపూర్‌మెట్, మే 10: ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారులో ఇద్దరు యువకులు సజీవదహనంకాగా.. మరో యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా గండిచెరువు సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డు పై చోటుచేసుకుంది.
బహదూర్‌పూర్‌కు చెం దిన దీపేష్ అగర్వాల్(23), విజయనగర్ కాలనీకి చెందిన సంచయ్ మల్ఫని(22), మూసాపేట్‌కు చెందిన ప్రియన్స్ మిట్టల్ (23) ప్రాణ స్నేహితులు. వీరంతా వేర్వేరు వ్యాపారాలు చేస్తుంటారు. శుక్రవారం రాత్రి దీపేష్‌కుమార్‌కు చెందిన కారులో ముగ్గురు బయటకు వెళ్లి, శనివారం తెల్లవారుజాము న 4 గంటలకు శంషాబాద్ వైపు నుంచి ఘట్‌కేసర్‌వైపు వెళ్తున్నారు.
ఈ క్రమంలో గండిచెరువు సమీపంలో రోడ్డు పక్కన నిలిపి ఉన్న మినీ ట్రక్‌ను వెనకనుంచి ఓవర్ స్పీడ్ తో ఢీకొట్టారు. దీంతో కారులో మంటలు చెలరేగాయి. దీపేష్ అగర్వాల్, సంచయ్ మల్ఫని కారులోనే సజీవ దహనం అయ్యారు. ప్రియన్స్ మిట్టల్‌ను వాహనదారులు గమనించి బయటకు తీసి దవాఖానకు తరలించగా చికిత్సపొందుతూ మృతిచెందాడు. దీపేష్ అగర్వాల్ తండ్రి రితే ష్ కుమార్ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.