11-05-2025 09:54:59 AM
న్యూఢిల్లీ: పాకిస్థాన్ మరోసారి తన వక్ర బుద్ధి చూపించింది. కాల్పుల విరమణ అవగాహన ఉల్లంఘనకు(Pakistan ceasefire violation) పాల్పడింది. సరిహద్దు రాష్ట్రాల్లో పాక్ డ్రోన్లతో మళ్లీ దాడులకు తెగబడింది. పాకిస్థాన్ డ్రోన్ దాడులను భారత రక్షణ వ్యవస్థ సమర్థంగా తిప్పికొట్టింది. పాక్ మళ్లీ డ్రోన్ దాడులకు దిగడంతో సరిహద్దు ప్రాంతాల్లో బ్లాక్ అవుట్ అమలు చేశారు. జమ్ము, శ్రీనగర్, కథువాలో పూర్తిగా బ్లాక్ అవుట్ అమలు చేశారు. శ్రీనగర్ లో కాల్పుల శబ్దాలు వినిపిస్తున్నాయని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా(Omar Abdullah) ట్వీట్ చేశారు. శ్రీనగర్ లో క్షిపణి రక్షణ వ్యవస్థను మళ్లీ సిద్ధం చేశారని ఒమర్ అబ్దుల్లా సూచించారు. నిన్న రాత్రి శ్రీనగర్ పాత నగరంలోకి డ్రోన్ దూసుకువచ్చింది. శ్రీనగర్ రాజ్ బాగ్(Srinagar Raj Bagh) ప్రాంతంలో నిన్న రాత్రి డ్రోన్లు కనిపించాయి. 25 కార్ప్స్ ప్రధాన కార్యాలయం వద్ద డ్రోన్లు కనిపించినట్లు సమాచారం. శ్రీనగర్ లో పాక్ డ్రోన్లను నిర్వీర్యం చేసినట్లు సైనిక వర్గాలు వెల్లడించాయి.
పాక్ కాల్పుల విరమణ అవగాహన ఉల్లంఘనతో పంజాబ్ లో బ్లాక్ అవుట్ అమలు చేశారు. పంజాబ్, అమృత్ సర్, పాటియాలా, నవాన్ షహర్, పఠాన్ కోట్, ఫాజిల్కా, ఫిరోజ్ పూర్, మోగా, భఠిండా, బర్నాలా, ముక్త్ సర్, హోషియార్ పూర్, గురుదాస్ పూర్, రాత్రి బ్లాక్ అవుట్ చేశారు. పఠాన్ కోట్, ఫాజిల్కా జిల్లాల్లో శనివారం రాత్రి రెండు చోట్ల డ్రోన్లు కనిపించినట్లు స్థానికులు తెలిపారు. ముందస్తు జాగ్రత్తగా చర్యల్లో భాగంగా పలు జిల్లాల్లో బ్లాక్ అవుట్ విధించినట్లు అధికారులు తెలిపారు. నిన్న రాత్రి భఠిండాలో సైరన్లు మోగినట్లు నివేదికలు చెబుతున్నాయి. కచ్ ప్రాంతంలో రాత్రి డ్రోన్లు కనిపించినట్లు గుజరాత్ హోం మంత్రి(Gujarat Home Minister) వెల్లడించారు. కచ్ లో బ్లాక్ అవుట్ పాటిస్తున్నట్లు గుజరాత్ హోంమంత్రి ట్వీట్ చేశారు. గుజరాత్ తోని భుజ్, బనస్కాంతా, పటాన్, సంతాల్ జిల్లాల్లోని పలు గ్రామాల్లో నిన్న రాత్రి బ్లాక్ అవుట్ అమలు చేశారు.