18-08-2025 01:02:27 AM
రూ.3 కోట్ల 61 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శేరిలింగంపల్లి, ఆగస్ట్ 17:పిల్లలు, పెద్దల ఆహ్లాదం కోసం పార్కులు ఏర్పాటు చేశామని పీఏసీ చైర్మన్,ఎమ్మెల్యే గాంధీ అన్నారు.ఆదివారం మియాపూర్ డివిజన్ పరిధిలోని మయూరి నగర్ కాలనీలో రూ. 3 కోట్ల 61 లక్షల రూపాయల అంచనావ్యయంతో (మల్టీ జనరేషన్) పార్క్ ను కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ప్రారంభించారు. అనంతరం సీసీ రోడ్ల సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ మల్టీ జనరేషన్ పార్క్ ను అన్ని హంగులతో,సకల సౌకర్యాలతో ,అన్ని రకాల సదుపాయాలతో ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రతి నిత్యం వ్యాయామం చేస్తూ ఆరోగ్యం కాపాడుకోవాలని సూచించారు.
మయూరి నగర్ కాలనీ పచ్చని చెట్లతో విరాజిల్లాలని, మయూరి నగర్ కు చాలా ప్రాధాన్యత ఉందని ఆ ప్రాధాన్యతలో భాగంగా మయూరి నగర్ లోని పార్క్ లో పచ్చని చెట్లు కనిపించాలని దానికి మయూరి నగర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు,అసోసియేషన్ సభ్యులు, తదితరులు పెద్ద సంఖ్యలోపాల్గొన్నారు.