calender_icon.png 4 December, 2025 | 12:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉప్పల్ స్టేడియంలో హార్థిక్ ధనాధన్

03-12-2025 12:00:00 AM

హైదరాబాద్, డిసెంబర్ 2 : చాలా రోజు ల తర్వాత ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ సం దడి కనిపించింది. దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ కోసం పలువురు స్టార్ క్రికెటర్లు బరిలోకి దిగారు. పంజా బ్, బరోడా మధ్య జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ శర్మ, హార్థిక్ పాండ్యా ఆడడంతో క్రేజ్ కనిపించింది.

ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ, హార్థిక్ పాండ్యా ధనాధన్ బ్యాటింగ్‌తో అలరించారు. మొదట పంజా బ్ కెప్టెన్ అభిషేక్ శర్మ తన సూపర్ ఫామ్ కొనసాగిస్తూ మరో హాఫ్ సెంచరీ చేసి జట్టుకు భారీస్కోర్ అం దించాడు. ఛేజింగ్‌లో హార్థి క్ కూడా రెచ్చిపోయాడు. బ్యాటింగ్‌కు అనుకూలించే ఉప్పల్ పిచ్‌పై భారీ షాట్లతో అభి మానులను అలరించాడు.

కేవలం 42 బం తుల్లోనే 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 77 పరుగులతో నాటౌట్‌గా నిలి చి బరోడాను గెలిపిం చాడు. అయితే ఫ్రీ ఎంట్రీ ఇచ్చిన హెచ్‌సీఎ అనుకున్న రీతిలో సెక్యూరిటీ ఏర్పాట్లు చేయలేదు. ఫలితంగా పలువురు అభిమానులు పలుసార్లు గ్రౌండ్‌లోకి దూసుకొచ్చారు. తమ అభిమాన క్రికె టర్లతో సెల్ఫీలు దిగుతూ హంగామా చేశా రు.

హార్థిక్ పాండ్యా ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు పలువురు అభిమానులు పిచ్‌పైకి దూసుకొచ్చి అతని కాళ్లకు దండం పెట్టా రు. హార్థిక్ సైతం వారిపై కోప్పడకుండా సెల్ఫీలు దిగా డు. వారిని కొట్టొద్దంటూ సెక్యూరిటీకి సూ చించాడు. ఈ కారణంగా పలుసార్లు మ్యాచ్ కు అంతరాయం కలిగిం ది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారా యి. ఈ మ్యాచ్‌లో పంజాహబ్ 20 ఓవర్లలో 222 పరుగులు చేయగా.. బరోడా 19.1 ఓవర్లలో టార్గెట్‌ను అందుకుంది.