11-11-2025 12:00:00 AM
రంజీ ట్రోఫీ రౌండప్ : ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీలో పలువురు యువ ఆటగాళ్లు దుమ్మురేపుతున్నారు. ముంబై ఆల్‌రౌండర్ షంషి ములానీ తన సూపర్ ఫామ్ కొనసాగిస్తున్నాడు. గత రెండేళ్లుగా దేశవాళీ క్రికెట్‌లో అదరగొడుతున్న ములానీ తాజాగా హిమాచల్‌ప్రదేశ్‌పై ఆల్‌రౌండ్ ప్రదర్శనతో సత్తా చాటాడు. బ్యాటిం గ్‌లో హాఫ్ సెంచరీ, బౌలింగ్‌లో 7 వికెట్లు తీసి ముంబై విజయంలో కీలకపాత్ర పోషించాడు. ముంబై బ్యాటర్లు ముషీర్‌ఖాన్, సిద్దేశ్ లాడ్ సెంచరీలకు తోడు ములానీ బౌలింగ్ దెబ్బకు హిమాచల్‌ప్రదేశ్ ఇన్నింగ్స్ 120 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది.
ధృవ్ షోరే శతకాల మోత :
ఒడిశాతో జరుగుతున్న మ్యాచ్‌లో విదర్భ ఆటగాడు ధృవ్ షోరే రెండో ఇన్నింగ్స్‌లోనూ సెంచరీ బాదాడు. తొలి ఇన్నింగ్స్‌లో 144 రన్స్ చేసిన షోరే రెండో ఇన్నింగ్స్‌లో 101 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో విదర్భ 286 పరుగులు చేయగా.. ఒడి శా 160 పరుగులకే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్‌లో విదర్భ 218/2 స్కోర్ దగ్గర ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. దీంతో 345 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఒడిశా మూడోరోజు ఆటముగిసే సమయానికి వికె ట్ నష్టపోకుండా 44 పరుగులు చేసింది.
విజయం కోసం చివరిరోజు ఒడిశా ఇంకా 301 రన్స్ చేయాలి. ఇదిలా ఉంటే శివమ్ మావి ఆల్‌రౌండ్ షోతో నాగాలాండ్‌పై ఉత్తర్‌ప్రదేశ్ ఇన్నింగ్స్ 265 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది. మావి 101 రన్స్ చేయడంతో పాటు బంతితోనూ రాణించి 5 వికెట్లు తీశాడు. అలాగే ఉత్తరాఖండ్‌పై హర్యానా ఇన్నింగ్స్ 28 రన్స్ తేడాతో గెలిచింది. జగదీశ్ సుచిత్ 11 వికెట్లు తీయడంతో పాటు హాఫ్ సెంచరీ చేశాడు.
ఇక సర్వీసెస్‌పై గుజరాత్, ఛండీఘడ్‌పై పంజాబ్, పుదుచ్ఛేరిపై ఛత్తీస్‌ఘడ్ విజయాలు సాధించాయి.రాజస్థాన్‌తో జరుగు తున్న మ్యాచ్‌లో హైదరాబాద్ ఓవరాల్‌గా 293 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. మూ డోరోజు ఆటముగిసే సమయానికి హైదరాబాద్ తన రెండో ఇన్నింగ్స్‌లో 198/7 స్కోర్ చేసింది.