06-05-2025 12:00:00 AM
ముషీరాబాద్, మే 5 (విజయక్రాంతి): విద్యార్థులు క్రమశిక్షణతో చదివినప్పుడే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని ఎమ్మెల్యే ముఠాగోపాల్ అన్నారు. సోమవారం ముషీరాబాద్ రేడిెుంట్ హైస్కూల్ స్థాపించి 61 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు బాగా చదివిన విద్యార్థులకు, అటెండెన్స్ 100 శాతం ఉన్న విద్యార్థులకు సర్టిఫికెట్లు, మెడల్స్ పంపిణీ చేశారు.
ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే ముఠాగోపాల్, స్కూల్ కరస్పాండెంట్ సయ్యద్ అహ్మద్ భక్తియార్ తో కలిసి విద్యార్థులకు సర్టిఫికెట్లు అందించి అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకుని సమాజంలో తల్లిదండ్రులకు, ఉపాధ్యా యులకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలన్నారు. విద్యార్థులపైనే దేశ భవిష్యత్ ఆధార పడి ఉందని, క్రమశిక్షణతో చదువుతూ ఇతరులకు ఆదర్శంగా ఉండాలన్నారు.
అనంత రం స్కూల్ కరస్పాండెంట్ సయ్యద్ అహ్మద్ భక్తియార్ ఎమ్మెల్యేను శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ యువ నాయకుడు ముఠా జైసింహా, ముషీరాబాద్ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు శ్రీధర్రెడ్డి, ఆకుల అరుణ్ కుమార్, పార్టీ సీనియర్ నాయకులు శివముదిరాజ్, దీనదయాల్ రెడ్డి, డివిజన్ నాయకులు కధీర్, టెంట్ హౌస్ శ్రీనివాస్, మోహిన్, మహ్మద్ అలీ, జావిద్భాన్, ఉపాధ్యాయ ఎలు ఎండి ఖలీల్ అన్వర్, మంజూశ్రీ, హస్రాఫాతిమా, ఇఫ్రానా తదితరులు పాల్గొన్నారు.