06-05-2025 12:00:00 AM
మంచిర్యాల, మే 5 (విజయక్రాంతి) : రాష్ట్రంలో విద్యా రంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యత ఇస్తుందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. సోమవా రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇటీవల విడుదలైన టెన్త్, ఇంటర్మీడియట్ ఫలి తాలలో మైనార్టీ సంక్షేమ శాఖ పరిధిలోని పాఠశాలలు, కళాశాలలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థి నీ, విద్యార్థులను జిల్లా కలెక్టర్ కుమార్ దీప క్, జిల్లా అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమశాఖ అధికారి నీరటి రాజేశ్వరిలతో కలిసి శాలువాలతో సత్కరించారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రభు త్వం విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తూ ప్రతి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పూర్తి స్థాయిలో సదుపాయా లు కల్పించడం జరుగుతుందని తెలిపారు. విద్యారంగానికి ప్రథ మ ప్రాధాన్యత ఇస్తూ అన్ని రకాలుగా కృషి చేస్తుందని తెలిపారు. విద్యా రంగంలో జిల్లా ను రాష్ట్రంలో ముందంజలో ఉంచాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
టాస్క్ ద్వారా ఉచిత నైపుణ్య శిక్షణ
తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ డిపార్ట్మెంట్ (టాస్క్) ద్వారా ఉపాధి సామర్థ్యాన్ని పెంచే నైపుణ్య శిక్షణ అందించడం జరుగుతుందని పెద్దపల్లి ఎంపీ వంశీ కృష్ణ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన టాస్క్ శిక్షణ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ 30 రోజుల పాటు అర్హత గల యువతకు పరిశ్రమ సంబంధిత నైపుణ్యాలను అం దించి వారి ఉపాధి అవకాశాలను పెంపొందించడం జరుగుతుందని, అభ్యర్థుల వయ స్సు 18- సంవత్సరాల మధ్య ఉండాలని, డిగ్రీ, డిప్లొమా, బి.టెక్ పూర్తి చేసి ఉం డాలని తెలిపారు.
శిక్షణ కార్యక్రమం అనంతరం నైపుణ్యత గల అభ్యర్థులకు ఉపాధి అవకాశానికి సహాయం అందించబడుతుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధి కల్పన అధికారి రవికృష్ణ, టాస్క్ ప్రతినిధి సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఏటీసీలది కీలక పాత్ర
మందమర్రి, మే 5: గ్రామీణ యువతకు ఆధునిక శిక్షణ ఇవ్వడంలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ లది కీలకపాత్ర అని పెద్దపెల్లి ఎంపీ వంశీకృష్ణ అన్నారు. పట్టణంలోని ఏటీసీ సెంటర్‌ను సోమవారం ఆయన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలసి సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన ఏటీసీలో శిక్షణ పొందుతున్న అభ్యర్థులతో ముఖాముఖి చర్చించారు. విద్యార్థుల అవసరాలు, సమస్యలు, కేంద్రంలోని ప్రత్యేకతలను ఎంపీ సమీక్షించారు.
టెక్నికల్ శిక్షణ, ఉపకరణాల అందుబాటుపై అధికారులు ఇచ్చిన వివరాలను పరిశీలించారు. విద్యార్థుల అభ్యున్నతికి అవసరమైన సదుపా యాలు కల్పించేందుకు ముందుంటానని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఐటీఐ ప్రిన్సిపల్ దేవానంద్, వివిధ శాఖల అదికారులు సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.