calender_icon.png 19 November, 2025 | 9:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మధ్య తరగతికి భరోసా ఇచ్చే బడ్జెట్

24-07-2024 01:42:26 AM

 ప్రధాని మోదీ ప్రశంస

న్యూఢిల్లీ: లోక్‌సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. మధ్య తరగతి ప్రజలకు భరోసా ఇచ్చే బడ్జెట్ ఇదని ప్రశంసించారు. దళితులు, అణగారిన వర్గాలకు శక్తినిచ్చే బడ్జెట్ అని పేర్కొన్నారు.‘ మహిళల స్వావలంబనకు బాటలు వేశాం. చిరు వ్యాపారులు, ఎంఎస్‌ఎంఈల అభివృద్ధికి కొత్త బాటలు వేశాం. మౌలిక, తయారీ రంగాలను బలోపేతం చేసేలా ఈ బడ్జెట్ ఉంది. దేశ ఆర్థికాభివృద్ధికి ఈ బడ్జెట్ దోహదం చేస్తుంది. ఉద్యోగ కల్పన, స్వయం ఉపాధికి ప్రాధాన్యత ఇచ్చాం. ఎంప్లాయ్‌మెంట్ లింక్డ్ స్కీమ్ ద్వారా కొత్త ఉద్యోగాల కల్పన జరుగుతుంది. కొత్త ఉద్యోగులకు తొలినెల జీతం ప్రభుత్వమే ఇస్తుంది.

కోటి మందికి ఇంటర్న్‌షిప్ అవకాశం కల్పిస్తున్నాం. దీనిద్వారా గ్రామీణులకూ పెద్ద కంపెనీల్లో పని చేసే అవకాశం లభిస్తుంది’ అని ప్రధాని అన్నారు. ‘బడ్జెట్‌లో నైపుణ్యాభివృదిక్ధి పెద్ద పీట వేశాం. యువత కలలను నెరవేర్చే బడ్జెట్ ఇది. గ్రామంనుంచి మహానగరం దాకా అందర్నీ వ్యాపారవేత్తలను చేయడమేమా లక్ష్యం. ముద్రా రుణాల పరిధిని రూ.10లక్షలనుంచి రూ.20 లక్షలకు పెంచాం. భారత్‌ను గ్లోబల్ మ్యాన్చుఫ్యాక్చరింగ్ హబ్‌గా మార్చుతున్నాం. ఎంఎస్‌ఎంఈలకు రుణాలను ఇచ్చేందుకు కొత్త పథకాన్ని తీసుకువస్తున్నాం’ అని ప్రధాని అన్నారు.