calender_icon.png 19 November, 2025 | 8:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మైనింగ్ రంగంలో విప్లవాత్మక మార్పులు

24-07-2024 01:41:13 AM

కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్, జూలై 23 (విజయక్రాంతి): ఆత్మనిర్భర్ భారత్ నిర్మా ణమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం బడ్జె ట్ ప్రవేశపెట్టిందని కేంద్ర బొగ్గు, గను ల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. దేశీయ ఉత్పత్తిని పెంపొందించడానికి, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వారికి బడ్జెట్లో పన్ను ఆదా ప్రకటించారు. వీధి వ్యాపారుల నుంచి మొదలు రైతులు, పారిశ్రామికవేత్తల వరకు అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారని కితాబిచ్చారు. ‘సబ్‌కా సాథ్ సబ్‌కా వికాస్’లో భాగంగా పేదలను శక్తివంతం చేయడం, అన్నదాత ఉత్పాదక సామర్థ్యాలను పెంచేలా కేంద్రం నిర్ణయం తీసుకుందన్నారు.

4 కోట్ల మంది యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా బడ్జెట్‌లో ప్రతిపాదనలు చేశాం. వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ.1.5 లక్షల కోట్లు బడ్జెట్‌లో కేటా యించినట్లు తెలిపారు. మహిళలు, బాలికలకు లబ్ధి చేకూర్చే పథకాలకు రూ.3 లక్షల కోట్ల మేర ప్రతిపాదనలు చేయడం గొప్ప విషయమన్నారు. అలాగే బడ్జెట్‌లో ఆఫ్ షోర్ మినరల్ బ్లాక్స్ వేలం, క్రిటికల్ మినరల్స్ మిషన్, 25 క్రిటికల్ మినరల్స్ మీద దిగుమతి సుంకాన్ని తొలగించడం, మరో రెండు మినరల్స్ మీద దిగుమతి సుంకాన్ని తగ్గించడం, బ్లిస్టర్ కాపర్ మీద దిగుమతి సుంకాన్ని పూర్తిగా తొలగించడం వంటి మంత్రిత్వశాఖకు సంబంధించిన కీలకమైన అంశాలున్నాయి.

స్థిరమైన అభివృద్ధి, సాంకేతికత ఆవిష్కరణ, ఆర్థిక వృద్ధి పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను బడ్జెట్ ప్రతిబింబిస్తోంది. మైనింగ్ రంగానికి సంబంధించి చేసిన బడ్జెట్ ప్రకటనలు.. దేశ మైనింగ్ రంగ ఆధునీకరణ, ఆత్మనిర్భర్ భారత్ దిశగా కీలకమైన ముందడుగు వేయడానికి సహాయపడతాయన్నారు. దేశ ఖనిజ అవసరాలను తీర్చేలా బడ్జెట్‌లో కేటాయింపులు చేసిన ప్రధాని నరేంద్రమోదీ, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌కు ధన్యవాదములు తెలుపుతున్నాం.