calender_icon.png 17 November, 2025 | 1:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మల్లన్న ఆలయంలో భక్తుల సందడి

17-11-2025 12:02:15 AM

కొమురవెల్లి, నవంబర్16భక్తులసందడి ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం భ క్తులతో కిటకిటలా డింది. ఆదివారానికి పవి త్ర కార్తీక మాసం తోడవడంతో మల్లన్న స్వా మి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం ఉదయం నుంచే భక్తుల కోలహాలం మొదలైంది. స్వా మి వారి దర్శనానికి భక్తులు క్యూ లైన్లో బా రులు తీరారు. దర్శనానికి గంటన్నర పైగా స మయం పట్టింది.

భక్తులు ముందుగా స్వామివారి పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి న అనంతరం గర్భాలయంలో ఉన్న మల్లన్న స్వామిని దర్శించుకున్నారు. తర్వాత మొక్కుబడులలో భాగంగా స్వామివారికి పట్నాలు, బోనాలు చెల్లించి, మొక్కులు చెల్లించుకున్నారు. అదేవిధంగా కొండపైనున్న ఎల్లమ్మ తల్లికి బోనాలు సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు. సుమా రు 25 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దేవాదాయ శాఖ వారు అన్ని ఏర్పాట్లు చేశారు.

 మల్లన్న దర్శించుకున్న కలెక్టర్

 కొమురవెల్లి మల్లికార్జున స్వామిని కలెక్టర్ కే. హైమావతి ఆదివారం దర్శించుకున్నా రు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం గర్భాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు జరిపారు. అంతకుముందు ఆలయ కార్యనిర్వాహణ అధికారి టంకశాల వెంకటేష్ తో మల్లన్న కళ్యాణం, జాతర ఏర్పాట్లపై చర్చించి, తీసుకోవలసిన చర్యలపై దిశా,నిర్దేశం చేశారు. ఆమె వెంట మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు.