calender_icon.png 17 November, 2025 | 1:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్మిక వర్గ వ్యతిరేక విధానాలపై అలుపెరుగని పోరాటం

17-11-2025 12:04:47 AM

  1. నాలుగు లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలి

రాష్ట్ర ప్రభుత్వం కార్మిక వర్గానికి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి

సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు 

సిద్దిపేట, నవంబర్ 16 (విజయక్రాంతి): కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వర్గ వ్యతిరేక విధానాలపై రాబోయే కలలో రాజలేని పోరాటాలను నిర్వహిస్తామ ని, రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ తరంగా కార్మికులకు పరిశ్రమ కార్మికులకు ఇచ్చిన హామీల ను వెంటనే నిలబెట్టుకొని వేతనాలు పెంచడానికి సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రా ములు డిమాండ్ చేశారు.

ఆదివారం సిఐటి యు సిద్దిపేట జిల్లా 4వ మహాసభ ప్రారంభ సూచికగా సిద్ధిపేట నుండి ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. కొండ భూదేవి ఫంక్షన్ హాల్ లో సిఐటియు జిల్లా అధ్యక్షుడు సంద బో యిన ఎల్లయ్య అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో చుక్క రాములు మాట్లాడుతూ ఇప్పటివరకు అమలులో ఉన్న 29 కార్మిక చట్టాల ను రద్దుపరిచి వాటు స్థానంలో నాలుగు లేబర్ కోడ్లను తీసుకురావడం మూలంగా కార్మికుల్ని కట్టు బానిసలుగా మార్చే ప్రయ త్నం

చేసిందని ఎనిమిది గంటల పని విధానాన్ని తొలగించి 10,12 గంటల వరకు పరి శ్రమల్లో పనిచేయాలని చట్టంలో వచ్చిన మార్పు కారణంగా శ్రమదోపిడికి గురి అవుతున్నారూ, పని భద్రత లేకపోవడం మూ లంగా డైలీ వేస్ కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ పద్ధతిలో పరిశీలిస్తున్నారని వీటితోపాటు సా మాజిక భద్రత పని ప్రదేశాల్లో లేకపోవడం వలన కార్మికులు అనేక అసమానతలు గురవుతున్నారని అన్నారు.

చేసిన ప్రతిపనికి కనీస వేతనం లేకపోవడం, కార్మికులకు అర్ధాలతో అలమటిస్తున్నారని పేదలుగా తయార వుతున్నారని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కారు సౌకగా ప్రైవేటుకు అప్పజెప్పడం మూలంగా పెట్టుబడిదారి చేతుల్లో కార్మికులు కట్టు బానిసలుగా మారే దుర్మార్గమైన చర్యలు కేంద్ర ప్రభుత్వం చేస్తుందని ఇలాం టి చర్యలపై రాబోయే కాలంలో ఉద్యమిస్తానన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం స్కీం వర్కర్లకు ఇచ్చిన హామీ ప్రకారం వేతనాలు పెంచకుం డా ఇబ్బందులు గురుచేస్తున్నారని మధ్యా హ్న భోజన కార్మికులకు పెండింగ్లో బిల్లులు ఉన్నాయని, ఆశ, అంగన్వాడి కార్మికులకు వేతనాలు పెంచడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని షెడ్యూల్ పరిశ్రమలో పనిచేస్తున్న వేతన ఒప్పందాలు చేసి వేతనాలు పెంచాల్సి ఉండగా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, రాబోయే కాలంలో రాష్ట్ర ప్రభుత్వం కార్మిక వర్గానికి ఇచ్చిన హామీల అమలు కోసం ఉద్యమిస్తామని ఆయన తెలిపారు. 

బహిరంగ సభలో జిల్లా మహాసభ ఆహ్వాన సంఘ చైర్మన్ సింగిరెడ్డి చంద్రారెడ్డి, సిఐటి యు రాష్ట్ర కార్యదర్శి ప ద్మశ్రీ, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆ ముదాల మల్లారెడ్డి, సిఐటియు జిల్లా కార్యదర్శి కాముని గోపాల్ స్వామి, జిల్లా కోశా ధికారి జి. భాస్కర్, ఉపాధ్యక్షులు శెట్టిపల్లి సత్తిరెడ్డి, ఎం. పద్మ, బండ్ల స్వామి, కాట మ ధు, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి చొప్పరి రవికుమార్, తునికి మహేష్, ఇప్పకాల శోభ, జిల్లా కమిటీ సభ్యులు మామి డాల కనకయ్య, అమ్ముల బాలార్సయ్య, మండల కన్వీనర్లు హమాలీ, భవన, ఆశ, అంగన్వాడి, మధ్యాహ్న భోజనం కార్మికులు పాల్గొన్నారు.