18-12-2025 02:07:10 AM
హుజురాబాద్(విజయక్రాంతి) : కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం పెరుకపల్లి గ్రామానికి చెందిన మేడిశెట్టి నీరవ్వ 105 ఏళ్ల వయసులో బుధవారం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. వృద్ధాప్యాన్ని లెక్కచేయకుండా, స్వతహాగా పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేసి ప్రజాస్వామ్యంపై ఉన్న బాధ్యతను చాటిచెప్పింది.