calender_icon.png 19 December, 2025 | 5:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆలయ అర్చకులకు వెంటనే జీతాలు

18-12-2025 02:06:27 AM

రాష్ట్ర ఫైనాన్స్ సెక్రటరీ హరిత వెల్లడి

భీమదేవరపల్లి, డిసెంబర్ 17 (విజయక్రాంతి) : తెలంగాణ రాష్ట్ర అర్చక సిబ్బంది జీతాలు వెంటనే అందిస్తామని  తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ సెక్రటరీ శ్రీమతి హరిత అన్నారు. భీమదేవరపల్లి మండలం కొత్త కొండకి బుధవారం రావడం జరిగింది.  దర్శనం అనంతరం  తెలంగాణ రాష్ట్రంలో అర్చక సిబ్బందికి జీతాలు ఇంతవరకు రాలేదు మేడం అని చెప్పిన వెంటనే హైదరాబాద్ ఫోన్ చేసి వెంటనే అర్చకులకు జీతాలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.

గురువారం జీతాలు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖ రాష్ట్ర అధి కారులకు ఆదేశించారు.  ముఖ్య అర్చక మొగిలిపాలెం రాంబాబు తో చెప్పడం జరిగినది. బుధవారము కొత్త కొండ లో  రాష్ట్ర ఫైనాన్స్ సెక్రటరీకి కృతజ్ఞతలు తెలిపిన అర్చక బృందం మొగిలిపాలెం రాం బాబు శ్రీకాంత్ వినయ్ రాష్ట్ర ఫైనాన్స్ సెక్రెటరీకి  కృతజ్ఞతలు తెలిపారు.