18-12-2025 02:07:58 AM
మహబూబాబాద్, డిసెంబర్ 17 (విజయక్రాంతి): ప్రజల ఆకాంక్షల మేరకు గ్రామాల అభివృద్ధికి కంకణ బద్ధులై పనిచేయాలని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన విజేతలైన సర్పంచ్ అభ్యర్థులను మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు డాక్టర్ భూక్యా ఉమ, ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ కోరారు.
మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మేజర్ పంచాయతీ సర్పంచ్ గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన తమ్మడపల్లి కుమార్ ను ఎమ్మెల్యే, డిసిసి అధ్యక్షురాలు ఘనంగా సన్మానించారు. కొత్తగా ఏర్పడ్డ ఇనుగుర్తి మండల అభివృద్ధికి ప్రణాళిక బద్ధంగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ సత్తూరి యాదగిరి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.