09-01-2026 01:06:09 AM
కార్పొరేటర్ ముద్దం నర్సింహ యాదవ్
సికింద్రాబాద్ జనవరి 8 (విజయ క్రాంతి): ఇటీవల జీహెచ్‌ఎంసీ డివిజన్ల పునర్విభజన లో భాగంగా కొత్తగా ఏర్పా టు చేసిన బోయిన్ పల్లి సర్కిల్ కార్యాలయాన్ని ఓల్ బోయిన్పల్లిలో ఏర్పాటు చేయాలని ఓల్ బోయిన్పల్లి కా ర్పొరేటర్ ముద్దం నర్సిహ్మా యాదవ్ కోరారు. ఈ మేరకు ఆయన గురువారం జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్ వీ కర్ణన్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. కొత్తగా ఏర్పాటు చేసిన సర్కిల్ పరిధిలో అధిక శాతం కాలనీలు, బస్తీలు ఓల్ బోయిన్ పల్లి ప్రాంతంలోనే ఉన్నాయని, ఈ సర్కిల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు చాలా సౌకర్యవంతంగా అందుబాటులో ఉంటుందని తెలిపారు. దీనిపై కమిషనర్ సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు. కమిషనర్ కు వినతి పత్రం అందజేసిన వారిలో కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ తో పాటు కూకట్ పల్లి కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ ఉన్నారు.