calender_icon.png 10 January, 2026 | 8:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గీర్వాణి విద్యాలయంలో ముందస్తుగా సంక్రాంతి సంబరాలు

09-01-2026 06:49:11 PM

చొప్పదండి,(విజయక్రాంతి): చొప్పదండి  పట్టణంలోని గీర్వాణి  విద్యాసంస్థల చైర్మన్ కొండ గంగయ్య ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్ సొప్పరి ప్రతాప్ ముందస్తుగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. చిన్నారులు సంక్రాంతి ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి హరిదాసు నాంచారమ్మ వేషధారణలతో, ఆటపాటలతో పలు కార్యక్రమాలు  చేపట్టారు.  పతంగిలు ఎగురవేయడం జరిగింది.

తెలుగింటి ఆడపిల్లల వస్త్రధారణలతో పల్లెటూరి జానపద నృత్యాలు, సంస్కృతిక కార్యక్రమాలు, ప్రదర్శనలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ విశిష్టత గురించి తెలుసుకోవడం విద్యార్థులకు ఎంతైనా అవసరమని, అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల కోఆర్డినేటర్స్  కోడూరి  నాగరాజు సిరిపురం  శ్రీనివాస్  యోగ మాస్టర్ సత్తినేని  శ్రీనివాస్ గారు, వైస్ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది.