09-01-2026 06:41:44 PM
సామాజిక కార్యకర్త దేశాయిపేట్ ప్రశాంత్
బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం దేశాయిపేట గ్రామం లోని ఎస్సీ కాలనీలో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థిని, విద్యార్థులకు శుక్రవారం దేశాయిపేట గ్రామ యువ నాయకులు సామాజిక కార్యకర్త దేశాయిపేట బి.ప్రశాంత్ కుమార్ నోటు బుక్కులు, పెన్నులు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... చదువు గొప్పతనం ఏమిటంటే మనిషి జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది.
జ్ఞానాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, వినయాన్ని ఇచ్చి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచి, మంచి నడవడికను నేర్పిస్తుంది, ఒత్తిడిని తగ్గించి మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. పేదరికాన్ని పారద్రోలి, ఉన్నతమైన జీవితాన్ని అందిస్తుందని, సమాజంలో గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. సుఖశాంతులను ప్రసాదిస్తుందని ప్రశాంత్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు జి.స్వరూప రాణి, గ్రామస్తులు పాల్గొన్నారు.