calender_icon.png 10 January, 2026 | 8:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాసవి పాఠశాలలో సంక్రాంతి పండుగ వేడుకలు

09-01-2026 06:32:34 PM

బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని వాసవి పాఠశాలలో శుక్రవారం సంక్రాంతి పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల యాజమాన్యం విద్యార్థులచే తెలంగాణ పల్లె పకృతిని మరిపించే విధంగా ఆట పాటలతో రంగురంగుల ముగ్గులు వేసి గొబ్బెమ్మలతో అలంకరించి రంగ రంగ వైభవంగా సంక్రాంతి పండుగ విశేషాలను చిన్నారులకు అర్థమయ్యే విధంగా పాఠశాల యజమాన్యం మోటమర్రి సంధ్యారాణి, త్రిమూర్తి నాగరాజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

విద్యార్థులు రైతుల వేషధారణతో ఆహుతులను అలరింపజేశారు. గంగిరెద్దుల ఫోటోలను అలంకరించి సంక్రాంతి పర్వదినం అవశేషాలను అందరికీ అర్థమయ్యే  విధంగా యజమాన్యం చిన్నపిల్లలను తీర్చిదిద్ది వారిని పూలతో ఆశీర్వదించడం గమనార్హం. ఇప్పటినుండి చిన్నపిల్లలకు పండగ విశేషాలను అల్లవారించాలన్న సంకల్పంతో వాసవి స్కూల్ యజమాన్యం ముందస్తుగా సంక్రాతి వేడుకలు నిర్వహించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ లక్ష్మి శ్వేత, కారాస్పాండెంట్ పాలకుర్తి విజయ్, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.