calender_icon.png 10 January, 2026 | 8:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లక్ష్య సాధనలో సిబ్బంది, మహిళా సమాఖ్య సభ్యుల ఉమ్మడి భాగస్వామ్యం తప్పనిసరి

09-01-2026 07:03:46 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని మహిళల స్వయం ఉపాధి పొందేందుకు అనువైన ఆదాయ మార్గాలను ఎంపిక చేసి మహిళాశక్తిలో భాగంగా వివిధ రకాల కార్యక్రమాలను బ్యాంకు లింకేజీ మరియు స్త్రీనిధి రుణాలు ఇప్పించడం ద్వారా మహిళల ఆర్థిక అభివృద్ధితో పాటు పేదల ఆర్థిక సుస్థిరతకు కృషి చేయాలని ఎపిఎం రాంనారాయణ గౌడ్ తెలిపారు. నాగిరెడ్డిపేట మండలంలోని మండల సమాఖ్య కార్యాలయంలో ఏర్పాటుచేసిన గ్రామ సంఘ సహాయకుల వర్క్ షాప్ సెమినార్లో మాట్లాడారు.

మహిళలకు స్థిరమైన జీవనోపాధి కల్పించి వివిధ రకాల పనుల ద్వారా ఆదాయం అభివృద్ధికి వివోఏ లు సహకరించాలని తెలిపారు. సిబ్బంది ఉమ్మడి భాగస్వామ్యంతో లక్ష్యసాధన చేయాలని అదేవిధంగా సంస్థాగత నిర్మాణం బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి తదితర అంశాల గురించి సమీక్ష నిర్వహించడం జరిగింది. సిబ్బంది తమ తమ స్వానుభవం జోడించి నూతన ఉత్తేజంతో ప్రాజెక్టును విజయం దిశగా నడిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో  సీసీలు దత్తు, నారాయణ, రమేష్, రషీద్, సావిత్రి, నజీర్ స్త్రీ నిధిమేనేజర్ అమల, అకౌంటెంట్ రాజు తదితరులు పాల్గొన్నారు.