తాగునీటి ట్యాంక్‌లో శవమా?
05-06-2024 12:05 AM
నల్లగొండ జిల్లా కేంద్రంలోని 11వ వార్డు పాతబస్తీ హిందూపురం మున్సిపల్ వాటర్ ట్యాంకులో పది రోజుల నుంచి పడివున్న మానవ మృతదేహాన్ని సోమవారం గుర్తించడం అ్యతంత విచారకరం. అంటే, ఇన్ని రోజులుగా ప్రజలకు అదే నీరు పంపిణీ జరి గిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇదే ప్రాంతంలోని నాగార్జునసాగర్‌లోని ఓ వాటర్ ట్యాంక్‌లో 30 కోతుల కళేబరాలను కొద్ది రోజుల క్రితం గుర్తించడం మరో దురదృష్టకర సంఘటన. సంబంధితులపై చర్యలు తీసుకోవడంతోపాటు మున్ముందు మరిన్ని చోట్ల ఇలాంటి ఘటనలు జరక్కుండా భద్రతాపరమైన చర్యలు తీసుకోవడం ఎంతో అవసరం.
రాంరెడ్డి కె., సూర్యాపేట






