పింఛన్ సొమ్ము పెంచండి!
05-06-2024 12:05 AM
కొత్త ప్రభుత్వం వచ్చి అప్పుడే ఆరు నెలలు గడుస్తున్నది. ఎన్నికలు కూడా ముగిశాయి కనుక, ఇక ఆలస్యం చేయకుండా ఇచ్చిన హామీ మేరకు పింఛన్ల సొమ్మును పెంచడం మంచిది. దివ్యాంగుల నుంచి వృద్ధ కళాకారుల వరకు అందరూ పెరిగే పింఛన్ డబ్బు కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీత, చేనేత కార్మికులు, ఎయిడ్స్ బాధితులు, డయాలసిస్ పేషెంట్లకు నెలకు రూ.2016 నుంచి 4,000కు, దివ్యాంగులకు నెలకు 4,016 నుంచి 6,000కు పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇప్పటికి వరుస ఎన్నికల పేరుతో కాలయాపన జరిగింది. ఇకనైనా, ప్రభుత్వం వెంటనే స్పందించాలి.
-శేషరత్నమ్మ, దరిపెల్లి, మెదక్‌జిల్లా






