2 May, 2026 | 7:48 PM

వరదలకు ముందే కళ్లు తెరవండి!

05-06-2024 12:05 AM

హైదరాబాద్ సికిందరాబాద్ జంట నగరాలలో వర్షం వస్తుందంటేనే భయమేస్తోంది. ఎటూ చిన్న, పెద్ద రోడ్లు కాల్వలుగా మారుతాయి. గుంతలు, లోతట్టు ప్రాంతాలు సరేసరి. జనావాసాలకు దగ్గరగా వున్న చెరువులు నిండుకోగా, అవి ఎప్పుడు పొంగి పొర్లుతాయో అన్న ఆందోళనలో ప్రజలు ఉన్నారు. నాలాలలో పేరుకుపోయిన చెత్తకుప్పలతోపాటు అక్రమ కట్టడాలు, కబ్జాలతో ప్రమాదకరంగా మారిన నాలాల నుంచి పెద్ద ముప్పు పొంచి వుంది. అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి.

 -పి.మోహన్‌రావు, మెహిదీపట్నం