06-11-2025 08:19:17 PM
జిల్లా ఎస్పీ రావుల గిరిధర్
వనపర్తి టౌన్: నేరరహిత సమాజమే ధ్యేయంగా పోలీసు అధికారులు, సిబ్బంది సమిష్టిగా విధులు నిర్వహించి ప్రజలకు సత్వర న్యాయంనేరాలపై కఠిన చర్యలు తీసుకోవడం మాత్రమే కాదు,ముందు నుంచే వాటిని అరికట్టే విధానాలపై దృష్టి పెట్టాలని సమయానుసారంగా స్పందించే పోలీస్ శాఖనే ప్రజలు గౌరవిస్తారని అందరూ జట్టు భావనతో పనిచేసి జిల్లా శాంతి భద్రతలను కాపాడాలని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు.గురువారం వనపర్తి జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ నెలవారి నేర సమీక్షా సమావేశం నిర్వహించి ఆయా పోలీస్ స్టేషన్లలో నమోదు అయిన గ్రేవ్ కేసులను పరిశీలించారు, ఆయా కేసులలో విచారణలో అధికారులు సేకరిస్తున్న ఆధారాలను పరిశీలించారు.
యాక్సిడెంట్ కేసులలో పోలీస్ అధికారులు ఎలాంటి విచారణ కొనసాగిస్తున్నారో పరిశీలించి పోలీస్టేషన్లలో మిస్సింగ్ కేసులు, దొంగతనం కేసుల ఇన్వెస్టిగేషన్లో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. పెండింగ్ కేసులను త్వరితంగా పరిష్కరిస్తూ పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించడానికి ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు.ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు గ్రామస్థాయిలో సమాచార వ్యవస్థను పటిష్టం చేసుకుని విపిఓ విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలని తెలిపారు.గ్రామాలలో ఎలాంటి సమస్యలు తలెత్తిన తమకు సమాచారం అందే విధంగా సమాచార వ్యవస్థను పటిష్టం చేసుకోవాలన్నారు. మండల పరిధిలో ఎలాంటి ఆసాంఘిక కార్యకలాపాలు నిర్వహించకుండా పర్యవేక్షించాలని తెలిపారు.
సిబ్బందికి క్రమశిక్షణ తప్పనిసరి అని, విధులలో ఎలాంటి నిర్లక్ష్యం వహించకూడదని తెలిపారు. పోలీస్టేషన్లో రిసెప్షన్ మరియు పోలీస్టేషన్ పరిసరాలను పరిశుభ్రతతో ఉంచుకోవాలని తెలిపారు.పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల గౌరవంగా వ్యవహరిస్తూ త్వరితగతిన ఫిర్యాదుదారుల సమస్యలను పరిష్కరించే విధంగా సిబ్బందిని కేటాయించి వారికి పోలీసుల పట్ల నమ్మకాన్ని పెంపొందించే విధంగా చూడాలన్నారు. పోలీస్టేషన్లో ఉండే రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరిస్తూ ఉండాలని ఎలాంటి పెండెన్సీ లేకుండా చూడాలన్నారు. ప్రతి ఒక్క రికార్డును కచ్చితంగా క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుందని ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా బాధ్యతాయుతంగా రికార్డుల నిర్వహణ చేపట్టాలని తెలిపారు.
కోర్టు డ్యూటీ అధికారి ఎలాంటి ముఖ్యమైన కేసులలోలైన సంబంధిత స్టేషన్ అధికారికి సమాచారం అందించి బాధితులకు న్యాయం చేకూర్చే విధంగా వ్యవహరించాలన్నారు. పోలీస్టేషన్లో ఎలాంటి అనవసర వాహనాలు లేకుండా దీర్ఘ కాలికంగా పెండింగ్లో ఉన్న కేసులను పూర్తి చేయాలని సూచించారు. డయల్ 100 పోలీస్ సిబ్బంది గ్రామ గ్రామాన సందర్శిస్తూ పోలీసులు ప్రజల కోసం విధులు నిర్వహించాలని అన్నారు. ఎలాంటి అత్యవసర సమయంలో నైన డయల్ 100 ను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిసిఆర్బి డీఎస్పీ, ఉమామహేశ్వరరావు, వనపర్తి డిఎస్పీ, వెంకటేశ్వరరావు, ఆత్మకూర్ సిఐ, శివకుమార్, స్పెషల్ బ్రాంచ్ సీఐ, నరేష్, డిసిఆర్బి ఎస్సై, తిరుపతిరెడ్డి, వనపర్తి జిల్లాలోని ఎస్సైలు, డీసీఆర్బి, ఐటి కోర్ సిబ్బంది, పోలీసుసిబ్బంది తదితరులు పాల్గొన్నారు.