calender_icon.png 7 November, 2025 | 12:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇర్కోడ్ మోడల్ స్కూల్ విద్యార్థినికి రాష్ట్ర స్థాయి అవార్డు

06-11-2025 10:11:44 PM

సిద్దిపేట రూరల్: సిద్దిపేట జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని MHRD కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కళా ఉత్సవ్ పోటీలలో ఇర్కోడ్ మోడల్ స్కూల్ విద్యార్థిని ఇ. సాయి సంతోషిణి విశేష ప్రతిభ కనబరిచింది. విజువల్ 2డి డ్రాయింగ్ విభాగంలో రాష్ట్ర స్థాయిలో తృతీయ బహుమతి సాధించి కీర్తి సాధించింది. ఈ సందర్భంగా సమగ్ర శిక్ష జాయింట్ డైరెక్టర్ రాజీవ్ సాయి సంతోషిణికి మెమొంటో, ప్రశంసా పత్రం అందజేశారు. మోడల్ స్కూల్ అదనపు సంచాలకుడు, ప్రిన్సిపల్, ఉపాధ్యాయ బృందం సాయి సంతోషిణిని అభినందించారు.