calender_icon.png 6 November, 2025 | 11:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కళాశాల అభివృద్ధికి సహకరిస్తాం

06-11-2025 10:00:12 PM

మహాత్మా జ్యోతిబాపూలే మహిళా డిగ్రీ కళాశాల వర్గల్ ను సందర్శించిన కాగ్నిజెంట్ ప్రతినిధులు..

గజ్వేల్: వర్గల్ మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల మహిళా డిగ్రీ కళాశాల అభివృద్ధికి తమ వంతుగా సహకరిస్తామని కాగ్నిజెంట్ విదేశీ కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. కాగ్నిజెంట్ విదేశీ కంపెనీ ప్రతినిధులు కళాశాలకి విచ్చేసి ప్రయోగశాలను సందర్శించి విద్యార్థుల ప్రయోగాత్మక జ్ఞానాన్ని అభినందించారు. విద్యార్థుల కళలను చూసి అభినందించి నూతన ఉత్తేజం పొంది పేద విద్యార్థుల కోసం నిర్మింపబడిన ఈ కళాశాలకు సరైన విద్యను అందించడానికి సరిపడా కంప్యూటర్ పరికరాలను అందజేస్తామని తెలిపారు. విద్యార్థులతో మాట్లాడి వారి భవిష్యత్ నిర్మాణానికి ఉద్యోగ నైపుణ్యాలను,  సామర్థ్యాలను ఏ విధంగా పెంపొందించుకోవాలో తెలియజేశారు. 

కళాశాలకు విచ్చేసిన కాగ్నిజెంట్ ప్రతినిధులలో మైఖేల్, రూట్టలెడ్జి, సి ఓ హెడ్ అప్ ఈ టి ఎస్, సుసన్ ల  మౌనిక, విభాగ అధిపతి (హెచ్ఆర్) కారోల్ బోరాసకి, డైరెక్టర్ ఈ టి ఎస్ స్టార్ట్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్, తోమోస్ జోన్స్, ఫైనాన్స్ సీనియర్ డైరెక్టర్, వైవీట్టే వర్గాస్  డెవలప్మెంట్ అధిపతి మురళి కోటగిరి ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ డైరెక్టర్. శ్రీరామ్ రంగమణి క్లైంట్ పార్ట్నర్,, నేహా రీచార్య  సీనియర్ డైరెక్టర్ (హెచ్ఆర్ ) బిభాస్ రాయ్, డెలివరీ హెడ్, (ఎంగేజ్మెంట్ డెలివరీ), నిర్మాణ సంస్థ ప్రతినిధులు అనురాధ, లావణ్య ఉన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శ్యాంప్రసాద్ లాల్, (మహాత్మ జ్యోతిబాపూలే డిగ్రీ కళాశాల జాయింట్ సెక్రెటరీ), జె.రాజేశం ( ఎం జె పి కళాశాలల ఆర్ సి ఓ, మెదక్ ) విచ్చేసారు. ఈ సందర్భంగా  కాగ్నిజెంటు ప్రతినిధులను కళాశాల సిబ్బంది  ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రధాన అధ్యాపకులు డాక్టర్ గడ్డం భాస్కర రావు, ఉప ప్రధాన అధ్యాపకులు పి.గోవిందరావు, ప్లేస్మెంట్ విభాగాధిపతి Dr. వి. రాధా, డి.డబ్ల్యూ. జయ, వివిధ శాఖల కళాశాల సిబ్బంది, విద్యార్థులు చక్కగా పాల్గొన్నారు.