calender_icon.png 6 November, 2025 | 11:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించాలి..

06-11-2025 10:01:41 PM

ఆడిషనల్ డీఏంహెచ్ఓ మనోహర్..

ఇంద్రవెల్లి (విజయక్రాంతి): మారుమూల గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించాలని అదనపు డీఏంహెచ్ఓ డాక్టర్ కుడిమేత మనోహర్ పేర్కొన్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓపీ రికార్డులతో పాటు పలు రిజీస్టర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆడీషనల్ డీఏంహెచ్ఓ మనోహర్ మాట్లాడారు... ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు వ్యాధుల పట్ల అవగాహన కల్పించాలని సూచించారు. గర్భిణీ స్త్రీలకు ప్రతి వారం చెకప్ చేస్తూ ఉండాలని, రక్తహీనత కలిగిన గర్భిణీ స్త్రీలను గుర్తించి పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకునేలా అవగాహన కల్పించాలన్నారు.అన్ని వేళల ప్రజలకు డాక్టర్లు, వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు పూజిత, వసంతరావు, హెచ్ఈఓ నాందేవ్,హెల్త్ సూపర్వైజర్ పవార్ సురేశ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.