calender_icon.png 7 November, 2025 | 12:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేరాలపై ప్రజల్లో అవగాహన ఉండాలి

06-11-2025 10:09:58 PM

ఎస్పీ డి జానకి..

జడ్చర్ల: సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యంతో సైబర్ జాగృక్ దివస్ జడ్చర్ల పట్టణంలోని మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ డి. జానకి మాట్లాడుతూ నేటి డిజిటల్ యుగంలో సైబర్ నేరాలు విస్తృతంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి పౌరుడు జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత అవసరమని సూచించారు. వంటి మోసపూరిత పద్ధతుల ద్వారా ప్రజలను మోసం చేస్తున్నట్లు వివరించారు. డిజిటల్ అరెస్టులు, ఓటీపీ మోసాలు, బ్యాంకింగ్ సంబంధిత సైబర్ నేరాల గురించి  వివరిస్తూ, ఏదైనా సైబర్ నేరం జరిగిన వెంటనే బాధితులు వెంటనే www.cybercrime.gov.ఇన్, టోల్ ఫ్రీ నంబర్ 1930 కి, WhatsApp 8712672222 కు సమాచారం ఇవ్వాలని సూచించారు.

ప్రజలు అడిగిన ప్రశ్నలకు జిల్లా ఎస్పీ సైబర్ క్రైమ్ సబ్‌ఇన్‌స్పెక్టర్ శ్రావణి  సమగ్ర సమాధానాలు ఇచ్చారు. జిల్లా పోలీస్ శాఖ ప్రజలందరికీ సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఏ మోసపూరిత లింక్‌లను నమ్మవద్దని సూచించింది. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహణలో భాగంగా విమెన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, సైబర్ క్రైమ్ సబ్‌ఇన్‌స్పెక్టర్ శ్రావణ్, మార్కెట్ కమిటీ సభ్యులు, షి టీమ్, కళాబృందం సభ్యులు, పెద్ద ఎత్తున జడ్చర్ల పట్టణ ప్రజలు, రైతులు, చిన్న వ్యాపారులు పాల్గొన్నారు.