calender_icon.png 7 November, 2025 | 12:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహదేవ్ పూర్ లో మాజీ ఎమ్మెల్యే పరామర్శలు

06-11-2025 10:22:15 PM

కాటారం (విజయక్రాంతి): మహదేవపూర్ మండలంలోని పలు కుటుంబాలను మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ పరామర్శించారు. మహదేవ్ పూర్ లో అనారోగ్యంతో బాధపడుతున్న కూరతోట శ్రీహరిని పరామర్శించారు. జియ్యరీ మధునమ్మ, గొట్టిముక్కల లక్ష్మీ లు ఇటీవల మరణించగా వారి చిత్రపటాలకు పూలు వేసి నివాళులు అర్పించి, వారి కుటుంబాలను పరామర్శించారు. కుదురుపల్లి గ్రామంలో కావేరి లచ్చయ్య కుటుంబాన్ని పరామర్శించారు.

మండల కేంద్రంలో మస్క శంకర్ ముందస్తు వివాహ వేడుకల్లో మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ పాల్గొని ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన వెంట మాజీ సర్పంచ్ శ్రీపతి బాపు, కాలేశ్వరం దేవస్థానం మాజీ చైర్మన్ పోత వెంకటస్వామి, బీఆర్ఎస్ యూత్ అధ్యక్షులు అలీమ్ ఖాన్, అంకారి ప్రకాష్, జవ్వాజి తిరుపతి, కూరతోట రాకేష్, గీతాబాయి తదితరులు పాల్గొన్నారు.