calender_icon.png 6 November, 2025 | 11:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాహనాలు నిదానంగా నడపండి

06-11-2025 10:07:50 PM

* మితిమీరిన వేగం ప్రమాదకరం.

* వాహనదారులు నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు.

* ఏకలవ్య సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సావిత్రి.

ముస్తాబాద్ (విజయక్రాంతి): ప్రతి నిత్యం ఎదో ఒక చోట రోడ్డు ప్రమాదాలు చూస్తూనే ఉన్నాం ఈ మధ్యకాలంలో ప్రమాదాల సంఖ్య పెరుగుతుంది. దీనికి ప్రధాన కారణాలు: అతివేగం, పరధ్యానంగా డ్రైవింగ్ చేయడం(ఉదాహరణకు, ఫోన్ వాడకం), మద్యం సేవించి వాహనం నడపడం, ట్రాఫిక్ నియమాలను పాటించకపోవడం, సీటు బెల్టులు లేదా హెల్మెట్లు ధరించకపోవడం, అలసట, అదేవిదంగా సరిగా లేని రోడ్డు పరిస్థితులు నెలకొన్నాయి. మొన్న చేవెళ్ల వద్ద జరిగిన టిప్పర్ లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైన  రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ఏకలవ్య సంఘం ప్రధాన కార్యదర్శి కుర్ర సావిత్రి స్పందిస్తూ బస్సు ప్రమాదంలో మరణించిన వారికి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సావిత్రి మాట్లాడుతూ ఏ వాహనదారుడైన డ్రైవింగ్ చేసేటప్పుడు వేగ పరిమితులను మించి వెళ్లడం ప్రమాద తీవ్రతను పెంచుతుందన్నారు. ఫోన్ వాడటం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం, మానసిక ఒత్తిడి కారణంగా ప్రమాదాలకు దారితీస్తుందని పేర్కొన్నారు.

త్వరగా వెళ్లాలనే ఆలోచన తో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ లో దూకుడుగా వ్యవహరించడం, అలసట కూడా ప్రమాదాలకు కారణమవుతున్నాయని తెలిపారు.వాహనాల్లో పరిమితికి మించి ప్రయాణం పై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. రహదారులపై కూరగాయలు, పండ్లు, అమ్మడం వలన వాహనదారులు రోడ్డుపై వాహనాలు నిలపడం కూడా రోడ్డు ప్రమాదాలకు కారణం అవుతున్నాయి,రోడ్లు సరిగా లేకపోవడం,కఠినమైన మలుపులు వంటివి ప్రమాదాలకు వాహన లోడింగ్: వాహనంలో అధికంగా సరుకు లోడ్ చేయడం కూడా ప్రమాదాలకు దారితీస్తుందన్నారు. ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న రహదారుల విస్తరణ పనులు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. వాహనాలు నిదానంగా నడపండి.సురక్షితంగా గమ్యం చేరుకోండి. నిర్లక్ష్యంతో వ్యవహరించి పోగొట్టుకోవద్దని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా మనం జాగ్రత్త వహిస్తూ ఎదుటివారిని కూడా జాగ్రత్తగా కాపాడుకుందాం.