06-11-2025 10:14:03 PM
మణుగూరు (విజయక్రాంతి): జిల్లాలో జరుగుతున్న 69వ ఎస్ జి ఎఫ్ పాఠశాలల జిల్లా స్థాయి క్రీడల్లో 14 హకీ అండర్ గ్రౌండ్ విభాగంలో రాధికా కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థి టీజీటీ కౌశిక్ హాకీ జిల్లా జట్టుకు ఎంపికైనట్లు పాఠశాల చైర్మన్ గంగిరెడ్డి మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థిని ప్రత్యేకంగా అభినందించారు. చదువుతో పాటు క్రీడల్లో కూడా ముందు ఉండాలని, డిసెంబర్ జరగబోయే మ్యాచ్ లలో కూడా ఉత్తమ ప్రతిభ కనబరిచి మంచి పేరును తీసుకురావాలని ఆకాంక్షించారు. డైరెక్టర్లు జయసింహా రెడ్డి, సంపత్ రెడ్డి, బద్ధం శ్రీని వాసరెడ్డి, నూకారపు రమేష్ ప్రధానోపా ధ్యాయులు నరేష్, కోఆర్డినేటర్లు ఉష, కీర్తి P.E.T నరేందర్, చంద్రకళ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఆద్యాపక, ఆద్యాపకే తర సిబ్బంది అభినందన శుభాకాంక్షలు తెలిపారు.