calender_icon.png 10 January, 2026 | 11:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నివేదిక వచ్చాక ఎన్‌ఈపీ అమలుపై నిర్ణయం

07-01-2026 01:24:05 AM

  1. రూ.500 కోట్లతో ఎర్త్ సైన్సెస్ వర్సిటీ అభివృద్ధి
  2. శాసనమండలిలో మంత్రి దామోదర రాజనర్సింహ

హైదరాబాద్, జనవరి 6 (విజయక్రాంతి): నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (ఎన్‌ఈపీ) అమలుపై అధ్యయనం కోసం కేశవరావు అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేశామని, కమిటీ నివేదిక వచ్చాక రాష్ట్ర విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా ఎన్‌ఈపీ అమలుపై నిర్ణయం తీసుకుం టామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. శాసనమం డలి లో మంగళవారం ప్రశ్నోత్తరాల సమయంలో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, గురుకులా లటైమ్ టేబుల్‌పై సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.

గతంలో సరియైన సౌకర్యాలు లేని అద్దె భవనాల్లో గురుకులాలను ప్రారంభించారని, దీంతో విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యారని మంత్రి తెలిపారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ పాలసీని తీసుకొచ్చామన్నారు. ఒక్కో స్కూల్‌ను రూ. 200 కోట్లతో, 25 ఎకరాల సువిశాల ప్రాంగణంలో అన్ని సౌకర్యాలతో నిర్మిస్తున్నామన్నారు.  

500 కోట్లతో వర్సిటీ అభివృద్ధి

డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూ నివర్సిటీకి చట్టబద్ధత కల్పించే తెలంగాణ యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లును శాసనమండలిలో మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రవేశపెట్టారు. సభ్యులు తీన్మార్ మల్లన్న, పిం గలి శ్రీపాల్ రెడ్డి, బల్మూరి వెంకట్ లేవనెత్తిన అంశాలకు ఆయన వివరణ ఇచ్చారు.

రూ. 500 కోట్లతో యూనివర్సిటీ అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. దేశంలోనే తొలి ఎర్త్ సైన్సెస్ వర్సిటీ అని, భవిష్యత్తులో ఖనిజాల పరిశోధనలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. చర్చ అనంతరం బిల్లును మండలి ఆ మోదించింది. సుల్తాన్‌పూర్ జేఎన్టీయూ క్యాం పస్‌ను భవిష్యత్తులో యూనివర్సిటీగా మార్చే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు.