calender_icon.png 10 January, 2026 | 12:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వికసిత్ భారత్, రోజ్గార్ ఆజీవికా మిషన్‌పై అవగాహన

07-01-2026 01:25:44 AM

రాజేంద్రనగర్, జనవరి 6 (విజయక్రాంతి): వికసిత్ భారత్ గ్యారంటీ రోజ్గర్ అజీవికా మిషన్ (గ్రామీణ్) (వీబీ - రామ్ జీ) బిల్లు 2025 పట్ల ప్రెస్ ఇన్ఫరేషన్ బ్యూరో (పీఐబీ) ఆధ్వర్యంలో మంగళవారం రాజేంద్రనగర్ లోని నేషనల్ అకడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్మెంట్ (నార్మ్) లో జర్నలిస్టులకు అవగాహన కల్పించారు. ఈ అవగాహన కార్యక్రమానికి జాతీయ గ్రామీణాభివృద్ధి,  పంచాయతీరాజ్ సంస్థ (ఎన్‌ఐ ఆర్డీపీఆర్) డైరెక్టర్ జనరల్ డాక్టర్ జి. నరేంద్రకుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నా రు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ 2005లో ఏర్పడిన మహాత్మా గాంధీ జాతీ య గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో 2025 డిసెంబరులో వీబీ రామ్ జీ బిల్లును పార్లమెంటులో ఆమోదించడం జరిగిందని తెలిపారు.

గతంలో ఈ పథకం ద్వారా 100 రోజులు ఉపాధి హామీ లభించేందన్నారు. ప్రస్తుత పథకం ద్వారా పని దినాలను 125 రోజులకు పెంచడం జరిగిందన్నారు. వ్యవసాయ కార్మికుల డిమాండ్‌ను తగ్గించడానికి 125 రోజుల పని దినాల మధ్య ఎప్పుడైన 60 రోజులు సెలవు ప్రకటించే అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో నార్మ్ యాక్టింగ్ డైరెక్టర్ డాక్టర్ గోపాల్ లాల్, పీఐబీ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ మానస్ క్రిష్ణకాంత్, ఎన్‌ఐర్డీపీఆర్ ప్రొఫెసర్ జ్యోతీస్ సత్యపాలన్, పీఐబీ కి చెందిన గాయత్రీ, నార్మ్ ప్రజా సంబంధాల అధికారిణి గుత్తికొండ అనీజ, పలు మీడియా సంస్థలకు చెందిన జర్నలిస్టులు పాల్గొన్నారు