calender_icon.png 12 August, 2025 | 8:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆహ్లాదకరమైన ప్రేమకథ మరొక్కసారి

11-08-2025 01:13:22 AM

నరేశ్ అగస్త్య, సంజనా సారథి ప్రధాన పాత్రల్లో నటించిన ఫీల్ గుడ్ లవ్స్టోరీ ‘మరొక్కసారి’. సి.కె.ఫిల్మ్ మేకర్స్ బ్యాన్ప బి.చంద్రకాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రచన, దర్శకత్వం లింగుట్ల. ఇప్పటికే చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుంటోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. పోస్టర్ చూస్తుంటే ఓ ఆహ్లాదకరమైన ప్రేమకథను చూడబోతోన్నామని అర్థమవు తోంది.

ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో మూవీ రిలీజ్ డేట్ను ప్రకటించనున్నారు. ఈ చిత్రాన్ని కేరళ, సిక్కిం, టిబెట్ సరిహద్దు ప్రాంతాల్లో చిత్రీకరించారు. 5,430 మీ. ఎత్తులో ఉండే గురుడోంగ్మార్ లేక్లో షూటింగ్ చేసిన ఏకైక, మొట్టమొదటి ఇండియన్ మూవీగా నిలిచిందీ చిత్రం. ఈ చిత్రంలో బ్రహ్మాజీ, సుధర్షన్, వెంకట్, వెంకట్ కాకమాను, దివ్యవాణి తదితరులు నటించారు. ఈ మూవీకి కెమెరామెన్గా రోహిత్ బచు, సంగీత దర్శకుడిగా భరత్ మాంచిరాజు, ఎడిటర్గా చోటా కే ప్రసాద్ పని చేస్తున్నారు.