11-08-2025 01:15:03 AM
హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబోలో బాలీవుడ్ లో భారీగా తెరకెక్కుతున్న స్పు సినిమా ’వార్ 2’. ఆగస్టు 14న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుందీ చిత్రం. ఈ నేపథ్యంలో వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఆదివారం ఏర్పాటు చేశారు. డైరెక్టర్ త్రివిక్రమ్, నిర్మాతలు దిల్ రాజు, నావంశీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ ఈవెంట్లో హృతిక్ రోషన్ మాట్లాడుతూ.. ‘ఎన్టీఆర్, నేను కో స్టార్స్ గా మొదలు పెట్టాము. బ్రదర్స్ గా సినిమాని ముగించాము.
మీరంతా నాకు ఒక ప్రామిస్ ఇవ్వాలి. మీరంతా నా బ్రదర్ ని ఇలాగే జీవితాంతం ప్రేమించాలి. నేను చేసిన అన్ని సినిమాల పైన వార్ 2 ఉంటుంది. నాకు చాలా గాయాలు అయ్యాయి ఈ షూటింగ్ లో. కానీ ఎన్టీఆర్ ని చూసి ఇతను ఎలా ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాడు అనుకునేవాడిని. ఎన్టీఆర్ ని చూసి అదే నొప్పితో నేను షూట్ కి రెడీ అనేవాడ్ని. నేను తారక్ చాలా విషయాల్లో ఒకటే. ఎన్టీఆర్ సింగిల్ షాట్ ఆర్టిస్ట్. నేను ఎన్టీఆర్ నుంచి నేర్చుకున్నాను షాట్ లో వంద శాతం ఎలా లీనమవ్వాలి అని.
ఎన్టీఆర్ తన షాట్ చెక్ చేసుకోడు ఎందుకంటే వంద శాతం ఇస్తాడు‘ అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ‘నందమూరి తారకరామారావు ఆశీస్సులు ఉన్నంతకాలం నన్ను ఎవరూ ఆపలేరు. రామోజీ నన్ను హీరోగా పరిచయం చేశారు. ఆ సినిమా ప్రారంభం రోజు నా పక్కన నాన్న హరికృష్ణ, అమ్మ శాలిని తప్ప ఎవరూ లేరు. అలా ప్రారంభమైన నా ప్రయాణం ఈ ఇరవై ఐదేళ్లలో ఇంత మంది అభిమానులతో సాగుతూ ఉంది. భవిష్యత్తులోనూ మనమంతా కలిసి ముందుకెళ్దాం. ఎవరెన్ని కామెంట్స్ చేసినా ’వార్2’ బొమ్మ అదిరిపోయింది. ఇది ఎన్టీఆర్ హిందీ సినిమానే కాదు.. హృతిక్ తెలుగు సినిమా కూడా. ఇండియాలో గొప్ప డ్యాన్సర్ హృతిక్. ఆయనతో కలిసి డ్యాన్స్ చేయడం నా అదృష్టం‘ అన్నారు.