calender_icon.png 28 January, 2026 | 3:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువతతోనే వికసిత్ భారత్ సాధ్యం

28-01-2026 12:21:28 AM

‘సంసద్ ఖేల్ మహోత్సవం’లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

ముషీరాబాద్, జనవరి 27 (విజయక్రాం తి): యువతతోనే  వికసిత్ భారత్ సాధ్యమని, యువత డ్రగ్స్ బారిన పడకుండా వారి మేద స్సు, శక్తిని దేశాభివృద్ధికి వినియోగించాలనే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన సంసద్ ఖేల్ మహోత్సవ కార్యక్రమం దేశ వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. సంస ద్ ఖేల్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని దోమలగూడ ఏవి కళాశాల గ్రౌండ్లో నిర్వహిస్తున్న కోకో, కబడ్డి, క్రీడా పోటీలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల నుంచి సుమారు 35వేల మంది యువతీ యువకులు క్రీడా పోటల్లో పాల్గొనేందుకు పేర్లను నమోదు చేసుకున్నారన్నారు.

ప్రధాని మోదీ నాయకత్వంలోనే దేశానికి ఎక్కువ పతకాలు వచ్చాయని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో దోమలగూడ మాజీ కార్పొరేటర్ టి.రవీందర్, మహంకాళి జిల్లా సికింద్రా బాద్ బీజేపీ అధ్యక్షుడు గుండగోని భరత్ గౌ డ్, ప్రధాన కార్యదర్శి ఎం. రమేష్ రాం, కార్యదర్శి సలంద్రి శ్రీనివాస్ యాదవ్‌తో పాటు కళాశాల పీఈటి ప్రకాష్ తో పాటు యువతి యువకులు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.