calender_icon.png 28 January, 2026 | 5:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డిప్యూటీ ఈవో పోస్టుల భర్తీలో మరింత జాప్యం!

28-01-2026 12:21:59 AM

పాఠశాల విద్యాశాఖ, టీజీపీఎస్సీ మధ్య కుదరని ఏకాభిప్రాయం

ఇంటర్వ్యూలొద్దని ఒకరు.. ఉండాలని మరొకరు   

హైదరాబాద్, జనవరి 27 (విజయక్రాంతి): రెండు విభాగాల అధికారుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఉద్యోగ ఖాళీల భర్తీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. పాఠశాల విద్యాశాఖ పరిధిలోని 24 డిప్యూ టీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ల(డిప్యూటీ ఈఓ) పోస్టులతోపాటు 110 అధ్యాపకులు, పీడీ తదితర పోస్టులు కలిపి మొత్తం 140 వరకు ఖాళీలున్నాయి. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రతిపాదనలను టీజీపీఎస్సీకు పాఠ శాల విద్యాశాఖ ఎప్పుడో పంపించింది. అయితే డిప్యూటీ ఈఓ పోస్టులకు ఇంటర్యూలు నిర్వహించాలని టీజీపీఎస్సీ అంటోంది. ఇంటర్వ్యూలు అవసరంలేదని పాఠశాల విద్యాశాఖ పేర్కొంటోంది.

దీనిపై వివరణ కూడా ఇస్తూ పాఠశాల విద్యాశాఖ అధికారులు టీజీపీఎస్సీకు లేఖ రాసి మూడు నెలలవుతోంది. కానీ, ఇంటర్వ్యూల అంశంపై టీజీపీఎస్సీ విద్యాశాఖ అధికారులతో విభేదిస్తుంది. ప్రస్తుతం గ్రూప్ పోస్టులకే ఇంటర్వ్యూలు లేనప్పుడు డిప్యూ టీ ఈవో పోస్టులకెందుకు? అని విద్యాశాఖ అధికారుల వాదన. దీంతో ఈ పోస్టుల భర్తీ అంశం ఎటూతేలకపోవడంతో ఉద్యోగులు నష్టపోవాల్సి వస్తోంది. గతంలో గ్రూప్ 1, 2, డిప్యూటీ ఈఓ పోస్టులకు ఇంటర్యూలుండేవి. పారదర్శకత కోసం గ్రూప్స్ ఇంటర్వ్యూ లను ఎత్తివేశారు. డిప్యూటీ ఈఓ పోస్టులకు ఉండాలని టీజీపీఎస్సీ పట్టుబట్టడంతో ఉ ద్యోగ నియామక ప్రక్రియకు జాప్యంగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.