calender_icon.png 18 December, 2025 | 10:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అయ్యప్ప ఆలయానికి రూ.40,118 విరాళం

18-12-2025 02:12:11 AM

కేసముద్రం, డిసెంబర్ 17 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణంలోని శ్రీ ధర్మశాస్త అయ్యప్ప ఆలయంలో నూతనంగా మైక్ సెట్ ఏర్పాటు కోసం కేసముద్రం మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి పద్మావతి దంపతులు తమ కుమార్తె వంగల గీత అజయ్ రెడ్డి దంపతులు రూ.40,118లను విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు ఓలం చంద్రశేఖర్, పోలేపల్లి యాకూబ్ రెడ్డి, పెరుమాండ్ల ఎల్ల గౌడ్, కేసముద్రం, ఇనుగుర్తి మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు అల్లం నాగేశ్వరరావు, కూరెల్లి సతీష్, ఆర్టిఏ కమిటీ మెంబర్ రావుల మురళి, మార్కెట్ డైరెక్టర్ చిదురాల వసంతరావు తదితరులు పాల్గొన్నారు.