18-12-2025 02:11:03 AM
సంగారెడ్డి జిల్లా మల్కాపూర్‌లో ప్రవీణ్‌కుమార్ విజయం
కొండాపూర్, డిసెంబర్ 17: గ్రామంపై ఉన్న మక్కువ, ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని వదులుకొని పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసి, ఉప సర్పంచుగా ఎన్నికయ్యాడు. సంగారెడ్డి జిల్లా కొం డాపూర్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన ప్రవీణ్‌కుమార్‌ది మొదటినుంచి రాజకీయ కుటుంబం. తన తండ్రి చనిపోయే వరకు రాజకీయాల్లోనే ఉన్నారు.
2006లో తండ్రి మృతి చెందిన తర్వాత 18 సంవత్సరాలు ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లోనే ఉంటూ, సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేశాడు. అయితే గ్రామానికి సేవ చేయాలనే ఆ కాంక్ష మాత్రం తగ్గక పోవడంతో తన ఉద్యోగాన్ని వదులుకొని గ్రామానికి తిరిగి వచ్చి, వార్డు మెంబర్ గా పోటీ చేసి, ఉప సర్పంచుగా విజయం సాధించాడు. తనకు అనుకూలంగా రిజర్వేషన్ రాకపోవడంతో సర్పంచుగా అను చరుడిని గెలిపించుకున్నారు. రాజకీయ కు టుంబం నుండి వచ్చిన తనకు సహజంగానే ప్రజాసేవపై దృష్టి మరలినట్లు తెలిపారు.