18-12-2025 02:13:15 AM
బీఆర్‌ఎస్ అభ్యర్థిపై కాంగ్రెస్ వర్గీయుల దాడి
వికారాబాద్, డిసెంబర్ -17 (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా పరిగి మండలం మాదారం గ్రామంలో మూడవ విడత పం చాయతీ ఎన్నికల్లో ఉద్రిక్తత చోటు చేసుకుం ది. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ వర్గీయుల మద్య ఘర్షణ జరగడంతో ఇరు వర్గాల వారికి గాయాలయ్యాయి. పోలింగ్ బూత్‌లో ఉన్న ఏజెంట్‌లు తమకు అనుకూలమైన వారి గుర్తులు చెపుతున్నారని ఆరోపిస్తూ మరో వర్గం వారు ఘర్షణకు దిగారు. దీంతో ఈ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
బీఆర్‌ఎస్ సర్పంచ్ అభ్యర్థి రాములుపై ప్రత్యర్థులు దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యా యి. ఆ తర్వాత రాములు వర్గీయులు కాంగ్రె స్ పార్టీకి చెందిన అనంతగారి సాయిరామ్, చిలుకమర్రి సాయిరాంపై దాడి చేయడంతో వారికి కూడా తీవ్ర గాయాలయ్యా యి. దీం తో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. ఈ కారణంగా గంటసే పు గ్రామంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.
పోలీసులు పెద్ద ఎత్తున గ్రామానికి చేరుకొని ఎలాంటి గొడవలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. గాయపడిన ఇరువర్గాల వారిని పరిగి ప్రభు త్వ ఆసుపత్రికి తరలించారు. ఓటమి భయంతోనే బిఆర్‌ఎస్ పార్టీ బలపర్చిన సర్పం అ భ్యర్థి రాము లుపై కాంగ్రెస్ నాయకులు దాడులకు పాల్పడుతున్నారని పరిగి మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ఆరోపించారు. బీఆర్‌ఎస్ నాయకులు అనవసరంగా కాంగ్రెస్ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి విమర్శించారు.