08-08-2025 06:00:53 PM
రెండు గంటల పాటు రాకపోకలకు అంతరాయం..
కామారెడ్డి జిల్లా సిరిసిల్ల రోడ్డులో ఘటన..
ఇబ్బందులు పడ్డ ప్రయాణికులు..
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) కేంద్రంలోని ఉగ్ర వాయి గ్రామ శివారులో శుక్రవారం వర్షాలకు పెద్ద చెట్టు రోడ్డుకు అడ్డంగా విరిగిపడడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కామారెడ్డి నుంచి సిరిసిల్ల వెళ్లే రహదారిలో రోడ్డుకు అడ్డంగా చెట్టు పడిపోవడంతో రెండు గంటల పాటు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆర్ అండ్ బి అధికారులకు స్థానికులు సమాచారం అందించడంతో వారు రోడ్డుకు అడ్డంగా ఉన్న చెట్టును తొలగించారు. భారీ వృక్షం కావడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కరీంనగర్, సిరిసిల్ల, మాచారెడ్డి వైపు వెళ్లే వాహనదారులు రోడ్డుకు అడ్డంగా చెట్టు పడడంతో వెళ్లడానికి ఇబ్బంది పడ్డారు. ఆర్ అండ్ బి అధికారులు రోడ్డు కు అడ్డంగా ఉన్న చెట్టును తొలగించడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చు కున్నారు.