08-08-2025 05:58:20 PM
బిచ్కుంద (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) బిచ్కుంద మున్సిపాలిటీ కేంద్రంలో శుక్రవారం జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్(MP Suresh Kumar Shetkar) జన్మదినోత్సవాన్ని కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. ఎంపీ షెట్కార్ ప్రజలకు చేస్తున్న సేవలను, అభివృద్ధిని కొనియాడుతూ ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తల మధ్య జనం మెచ్చే నాయకుడు జనం కొరకు బ్రతికే సేవకుడు అలుపెరుగని శ్రామికుడు జహీరాబాద్ అభివృద్ధి ధ్యేయంగా సాగుతున్న ఎంపీ సురేష్ షెట్కార్ జన్మదినోత్సవ సందర్భంగా కేక్ కట్ చేసి ఘనంగా జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కమల్ కిషోర్, పాషా సెట్, అవర్ సురేష్, పుల్లెన్ విఠల్, హాజీ బాల్ రాజ్, విమల్ సెట్, షావాజ్ సేట్, తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు.