calender_icon.png 3 November, 2025 | 11:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పండుగలా పూర్వ విద్యార్థుల సమ్మేళనం

03-11-2025 12:51:37 AM

ఆలేరు, నవంబర్ 2 (విజయక్రాంతి): ఆలేరు మండ లంలోని శారాజీపేట గ్రామంలో నలభై ఏండ్ల అనంతరం ఒకే వేదికపై కలుసుకోవడం ఆనందంగా ఉన్నదని  చదివిన 1985-1986 పూర్వ విద్యార్థులు సైదా బేగం, పాములపర్తి రాంచంద్రా రెడ్డి, దయ్యాల దేవేందర్ లు అన్నారు, పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. చాలా ఏండ్ల అనంతరం కలుసుకున్న సందర్బంగా, చిన్న నాటి మధుర స్మృతులను, ఆనం దాలను జ్ఞాపకం చేసుకున్నారు.  ఆనాటి గురువులను సన్మానించారు. తమ్మలి ఆశయ్య, కాండ్రా జు సత్తయ్య, చెన్నోజు శ్రీనివాస్, దోడ కొండయ్య, మద్దెల శ్రీనివాస్, నవనీత, స్వరూప, కళాభాయ్, సయ్యద్ అబ్బాస్, నారాగోని శ్రీనివాస్, యాదిరెడ్డి, జిల్లా మణెమ్మ, దూడల శ్రీనివాస్, చంద్ర ఋషి, బత్తుల కొండల్ రెడ్డి, దూడల జంగయ్య, ఏంపల్లి నీలెంధర్ రెడ్డి, సాయిరెడ్డి మల్లారెడ్డి, హేమలత, ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.

కల్మలచెరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో..

గరిడేపల్లి, నవంబర్ 2 : మండలంలోని కల్మలచెరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1984 - 1985 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించు కున్నారు.  తమకు విద్యాబుద్ధులు నేర్పి సమాజంలో ఉన్నతంగా ఎదిగేలా తీర్చిదిద్దిన ఉపాధ్యాయులు నారాయణరెడ్డి, పి.వీరబాబు, విజయ కుమారినీ ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ఎడవెల్లి వెంకటరెడ్డి, కంబాలపల్లి వెంకటనారాయణ,కడియం వెంకట్ రెడ్డి, అనంతరెడ్డి,శ్రీనివాస్ నాటి విద్యార్థులు 60 మంది పాల్గొన్నారు