calender_icon.png 3 November, 2025 | 6:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ సహకారంతో ఉద్యోగుల సమస్యలకు మోక్షం

03-11-2025 12:55:29 AM

భూమి ఉన్నంత వరకు ఉంటుంది రెవెన్యూ డిపార్ట్‌మెంట్ 

రాష్ట్ర రాజధానిలో రెవెన్యూ క్లబ్ నిర్మాణం 

రెవెన్యూ ఉద్యోగుల డిమాండ్ల సాధనే టీజీటీఏ, టీజీఆర్‌ఎస్‌ఏ లక్ష్యం

టీజీటీఏ, టీజీఆర్‌ఎస్‌ఏ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో  తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్, డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ అధ్యక్షుడు వి. లచ్చిరెడ్డి

యాదాద్రి భువనగిరి నవంబర్ 2 ( విజయక్రాంతి): ప్రభుత్వ సహకారంతో రెవెన్యూ ఉద్యోగుల సమస్యలకు మోక్షం లభిస్తుందని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్, డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ అధ్యక్షులు వి లచ్చిరెడ్డి అన్నారు. భూమి ఉన్నంత వరకు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంటుందని, రెవెన్యూ ఉద్యోగులకు 2026 పదోన్నతుల సంవత్సరం అవుతుందన్నారు. రెవెన్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కారం, న్యాయమైన డిమాండ్ల సాధనే టీజీటీఏ, టీజీఆర్ ఎస్‌ఏ లక్ష్యం అని ఆయన  అన్నారు. తెలంగాణ తహశీల్దార్ల సంఘం (టీజీటీఏ), తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ (టీజీఆర్‌ఎస్‌ఏ) రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆదివారం యాదాద్రిలో వి.లచ్చిరెడ్డి అధ్యక్షతన జరిగింది.

ఈ సమావేశంలో లచ్చిరెడ్డి మాట్లాడుతూ జీపీవోలు వచ్చాక ప్రజలకు, రైతులకు రెవెన్యూ సేవలు పెరిగాయన్నారు. సమీప భవిష్యత్తులో రెవెన్యూ ఉద్యోగులకు పదోన్నతులు వస్తాయని, త్వరలోనే 100 మందికి పైగా ఎమ్మార్వో లు డిప్యూటీ కలెక్టర్లు కాబోతున్నారన్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ ను కపడుకుంటూనే రెవెన్యూ, ప్రభుత్వ ఉద్యోగుల, ప్రజల సంక్షేమం కోసం మనం పాటుపడాలన్నారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చేసిన ప్రతి తీర్మానాన్ని అమలు చేసేల కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుందామన్నారు. 2026 జనవరి లో రెవెన్యూ ఉద్యోగుల స్పోరట్స్ మీట్ ఉంటుందన్నారు.

రెవెన్యూ ఉద్యోగులు బాధ్యత గా ఉద్యోగం చేయడంతో పాటు కుటుంబానికి సమయం ఇవ్వాలని సూచించారు. ఫ్యూచర్ సిటీలో రెవెన్యూ హౌసింగ్ సొసైటీ కింద వెయ్యి ఎకరాలు కొనుగోలు చేసేందుకు ప్రయత్నం జరుగుతుందన్నారు. అలాగే ప్రతి జిల్లాలో రెవెన్యూ కార్యాలయా ల నిర్మాణం కోసం ప్రయత్నాలు చేస్తామన్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగ రంలో రెవెన్యూ క్లబ్ కట్టుకోబోతున్నామని ఈ సందర్భంగా లచ్చిరెడ్డి తెలిపారు. క్షేత్రస్థాయి నుండి రాష్ట్రస్థాయి వరకు రెవెన్యూ శాఖ బలోపేతం అవుతుందన్నారు. జీపీవోలు, డీటీలు, డిప్యూటీ కలెక్టర్ల నియా మకంతో పనిభారం క్రమంగా తగ్గుతుందన్నారు. సమిష్టి నిర్ణయాలతోనే మనం ముం దుకు వెళ్దామని లచ్చిరెడ్డి పిలుపునిచ్చారు. 

 ప్రధానంగా చర్చించిన అంశాలు..

గత సంవత్సరంలో టీజీటీఏ, టీజీఆర్‌ఎస్‌ఏ చేసిన కార్యక్రమాలు, ప్రాతినిధ్యాలపై  అధ్యక్షులు రాములు, బాణాల రాంరెడ్డి వార్షిక నివేదికలను సమర్పించారు. అలాగే రెవెన్యూ ఉద్యోగుల పదోన్నతులు, ప్యానెల్లు, బదిలీలపై, రెవెన్యూ అసోసియేషన్ భవనాల కోసం భూముల గుర్తింపు, కేటాయిం పుపై, ప్రభుత్వ ఉద్యోగుల హౌసింగ్ పాలసీ, నగదు రహిత చికిత్స (E.H.S)పై, రెవెన్యూ శాఖ, భూభారతిపై టీజీటీఏ, టీజీఆర్‌ఎస్‌ఏ ఆధ్వర్యంలో రెవెన్యూ ఉద్యోగులకు శిక్షణ ఇచ్చే అంశాలపై ప్రధానంగా చర్చించారు.

అలాగే తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతులు, తహసీల్దార్ వాహనాలకు రవాణా నిధులు విడుదల, కారుణ్య నియామకాలకు సంబంధించిన అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఉద్యోగుల జేఏసీ కో చైర్మన్, డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కేతావత్ రామకృష్ణ, టీజీటీఏ అధ్యక్ష, కార్యదర్శులు ఎస్.రాములు, రమేష్ పాకా, టీజీఆర్‌ఎస్‌ఏ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు బాణాల రాంరెడ్డి, వి.బిక్షం, టీజీటీఏ అసోసియేట్ అధ్యక్షులు చల్లా శ్రీనివాస్, టీజీటీఏ మహిళా విభాగం అధ్యక్షురాలు పి.రాధ, టీజీఆర్‌ఎస్‌ఏ మహిళా విభాగం అధ్యక్షురాలు సుజాత చౌహాన్, సెక్రటరీ జనరల్ ఫూల్ సింగ్ చౌహాన్, ఆరేటి రాజేశ్వర్, టీజీఆర్‌ఎస్‌ఏ రాష్ట్ర కోశాధికారి మల్లేష్, అసోసియేట్ ప్రెసిడెంట్ అధ్యాయ శ్రీనివాస్, సీసీఎల్‌ఏ యూనిట్  అధ్యక్షులు రాంబాబు, సీసీఎల్‌ఏ యూనిట్  ప్రధాన కార్యదర్శి, చైతన్య క్రిష్ణ, ఆర్డీఓలు కృష్ణారెడ్డి, శేఖర్ రెడ్డి డీఎస్ వెంకన్న, మహిళా విభాగం అధ్యక్షురాలు సుజాత చౌహాన్, యాదాద్రి భువనగిరి జిల్లా టీజీటీఏ అధ్యక్షుడు పొదిల రవికుమార్, ప్రధాని కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, టీజిఆర్‌ఎస్‌ఏ జిల్లా అధ్యక్షుడు కొండం వెంకట్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పి.పల్లవి, 33 జిల్లాల నుంచి టీజీటీఏ, టీజీఆర్‌ఎస్‌ఏ అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.